ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    కరుణాపురంలో గుడ్ ఫ్రైడే సిలువ మార్గయాత్ర

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు3 ఏప్రిల్, 202608:23 AM
    కరుణాపురంలో గుడ్ ఫ్రైడే సిలువ మార్గయాత్ర
    ధర్మసాగర్ మండలం కరుణాపురం గ్రామంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా నిర్వహించిన పరిశుద్ధ సిలువ మార్గయాత్ర భక్తి పరవశంతో జరిగింది. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. విచారణ గురువులు ఫాదర్ సుధాకర్ ఆధ్వర్యంలో యాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా బైరపాక భార్గవ్ యేసు ప్రభువు వేషధారణలో పాల్గొని భక్తులను విశేషంగా ఆకర్షించారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై సిలువ మార్గయాత్రలో పాల్గొని ప్రార్థనలు చేశారు. గుడ్ ఫ్రైడే ప్రాధాన్యతను గుర్తుచేసుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుర్రపు రీనా ప్రవీణ్, గ్రామ పెద్దలు, సెయింట్ అగస్టిన్స్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: