ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    రూ.60.62 కోట్ల విలువైన విద్యుత్ అభివృద్ధి పనులకు శ్రీకారం

    • పల్లగుట్టలో ఉప ముఖ్యమంత్రి సభకు భారీ ఏర్పాట్లు
    • సభా స్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
    • ఒకే వేదికపై 4 ప్రారంభోత్సవాలు.. 3 శంకుస్థాపనలు
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు8 జూన్, 202606:11 AM
    రూ.60.62 కోట్ల విలువైన విద్యుత్ అభివృద్ధి పనులకు శ్రీకారం
    చిల్పూర్, జూన్ 8 ప్రజాధ్వని : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 9న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో సభా ఏర్పాట్లను మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం పరిశీలించారు. విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలోని సభా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
    రూ.60.62 కోట్ల విలువైన విద్యుత్ అభివృద్ధి పనులకు శ్రీకారం - అదనపు చిత్రం 1
    నియోజకవర్గంలో రూ.60.62 కోట్ల వ్యయంతో నిర్మించిన, నిర్మించనున్న ఏడు విద్యుత్ సబ్‌స్టేషన్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి హాజరుకానున్న నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. సబ్‌స్టేషన్ల కార్యక్రమాల అనంతరం పల్లగుట్టలో సుమారు ఆరు వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సభా వేదిక, ప్రాంగణం, పార్కింగ్, తాగునీరు, భద్రత తదితర అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
    రూ.60.62 కోట్ల విలువైన విద్యుత్ అభివృద్ధి పనులకు శ్రీకారం - అదనపు చిత్రం 2
    అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి తొలిసారిగా వస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. వేలేరు మండలం పీచరలో 132/33 కేవీ సబ్‌స్టేషన్, చిల్పూర్ మండలం కొండాపూర్, జఫర్‌గడ్ మండలం సాగరం, రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామాల్లో 33/11 కేవీ సబ్‌స్టేషన్లను ప్రారంభించనున్నట్లు చెప్పారు. అలాగే చిల్పూర్ మండలం లింగంపల్లి, పల్లగుట్ట, నష్కల్ గ్రామాల్లో 33/11 కేవీ సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు.
    రూ.60.62 కోట్ల విలువైన విద్యుత్ అభివృద్ధి పనులకు శ్రీకారం - అదనపు చిత్రం 3
    నియోజకవర్గ పరిధిలో ఇళ్లపై నుంచి వెళ్తున్న 33/11 కేవీ, సర్వీస్ లైన్ల మార్పిడి సమస్యలతో పాటు రఘునాథపల్లి 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను 220/132 కేవీ స్థాయికి అప్‌గ్రేడ్ చేయాలని ఉప ముఖ్యమంత్రిని కోరనున్నట్లు తెలిపారు. ఈ సబ్‌స్టేషన్ల ఏర్పాటు ద్వారా నియోజకవర్గంలో దాదాపు 90 శాతం విద్యుత్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజలు, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఒకే రోజు, ఒకే వేదికపై ఏడు సబ్‌స్టేషన్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్న నేపథ్యంలో రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, విద్యుత్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు
    మీ స్పందన:

    షేర్ చేయండి: