ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    కార్యకర్త కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల ఆర్థిక చేయూత

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు3 నవంబర్, 202604:35 AM

    కష్టకాలంలో కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలుస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మానవత్వాన్ని చాటుకున్నారు. జనగామ జిల్లా జాఫర్గడ్ మండలం తమ్మడపల్లి (ఐ) గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు రడపాక కనకయ్య తండ్రి ఇటీవల మృతి చెందడంతో, ఆయన…

    కార్యకర్త కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల ఆర్థిక చేయూత
    జాఫర్గడ్, నవంబర్ 3 ప్రజాధ్వని: కష్టకాలంలో కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలుస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మానవత్వాన్ని చాటుకున్నారు. జనగామ జిల్లా జాఫర్గడ్ మండలం తమ్మడపల్లి (ఐ) గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు రడపాక కనకయ్య తండ్రి ఇటీవల మృతి చెందడంతో, ఆయన కుటుంబాన్ని పార్టీ నాయకులు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు, వారి కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. సుఖదుఃఖాల్లో కార్యకర్తలతో కలిసి ఉండటమే పార్టీ నాయకత్వం బాధ్యతని, ఆపద సమయంలో కుటుంబానికి అండగా నిలవడం తమ కర్తవ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు ఆగబోయిన రాజు, కలకోట రజినీకాంత్, నీల నరసయ్య, నీలా యుగంధర్, డాక్టర్ రవి, రడపాక వెంకట నర్సు, రడపాక రాజు, రడపాక హరిబాబు (చిన్ని), గోనె రాజిరెడ్డి, రడపాక వెంకట స్వామి, రడపాక రవీందర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: