30 ఏళ్ల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు5 అక్టోబర్, 202605:45 AM

రాయపర్తి, అక్టోబర్ 5 (ప్రజాధ్వని): రాయపర్తి మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో 1995–96 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు 30 ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయ ఆవరణలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. సుమారు 65 మంది పూర్వ విద్యార్థులు సమ్మేళనానికి హాజరై ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. పాఠశాల రోజుల్లోని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అప్పట్లో చేసిన అల్లరి, చిలిపి చేష్టలను గుర్తుచేసుకుంటూ సరదాగా గడిపారు. మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ కలుసుకోవడం ఆనందంగా ఉందని పలువురు పేర్కొన్నారు. పాత స్నేహాలను కొనసాగిస్తూ భవిష్యత్‌లోనూ తరచూ కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గాజు మహేందర్, బండి రాములు, చోప్పెర చంద్రమౌళి, కోంగ శ్రవణ్‌కుమార్, రంగు కుమార్, గుమ్మడవెల్లి ఉదయ్‌చందర్, పెందోట వెంకన్న, కోంగ వెంకన్న, సుంచు సంతోష్, ఈరెడ్డి వెంకట్‌రెడ్డి, రోడ్డ రాజేందర్, కే. శ్రీనివాస్, ఐత సంధ్యారాణి, మామిడాల శశికళ, ఆరుట్ల జ్యోతి, హైమావతి తదితరులు పాల్గొన్నారు.
