ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    ఘనపూర్‌లో గోల్డెన్ బేకరీ ప్రారంభం

    • ప్రారంభించిన ఎస్‌ఐ వినయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు12 అక్టోబర్, 202610:29 AM
    ఘనపూర్‌లో గోల్డెన్ బేకరీ ప్రారంభం
    స్టేషన్ ఘనపూర్, అక్టోబరు 12 ప్రజాధ్వని: స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని స్టేషన్ రోడ్డులో రాయల్ సెలూన్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన గోల్డెన్ బేకరీని సోమవారం ఎస్‌ఐ వినయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపార రంగంలో నూతనంగా అడుగుపెడుతున్న నిర్వాహకులు వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు, మెరుగైన సేవలు అందిస్తూ వ్యాపారంలో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. స్థానికంగా నూతన వ్యాపార సంస్థలు ఏర్పాటు కావడం పట్టణ అభివృద్ధికి, ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొలిపాక సతీష్, కౌన్సిలర్ బొల్లు లక్ష్మి, పొన్న రవి, పెసరు సారయ్య, గట్టు రమేష్ గౌడ్, గట్టు రంజిత్ గౌడ్, అబ్దుల్ రవూఫ్, అజీముద్దీన్, బషీర్, షమీ, ఇర్ఫాన్, ఆయాజ్, యూనిస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: