ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    general

    బాల్య వివాహాల నిర్మూలనకు సమాజం భాగస్వామ్యం అవసరం_ఎంపీ కడియం కావ్య

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు25 ఫిబ్రవరి, 202604:03 AM
    బాల్య వివాహాల నిర్మూలనకు సమాజం భాగస్వామ్యం అవసరం_ఎంపీ కడియం కావ్య
    రాష్ట్రాన్ని బాల్య వివాహరహితంగా తీర్చిదిద్దేందుకు సమాజం మొత్తం బాధ్యతతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు. బాల్య వివాహాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని ఆమె సూచించారు. జనగామ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, స్కోప్ ఎన్జీవో సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బాల్య వివాహ విముక్తి అవగాహన ప్రచార రథాన్ని హనుమకొండలోని కనకదుర్గ కాలనీలో ఎంపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, పిల్లల బంగారు భవిష్యత్తును కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. బాల్య వివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, మానసిక వికాసంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఈ ప్రచార రథం గ్రామాలు, పట్టణాల్లో పర్యటిస్తూ బాల్య వివాహాల దుష్పరిణామాలు, చట్టపరమైన నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించనుందని తెలిపారు. బాల్య వివాహాలను అడ్డుకోవడంలో కుటుంబ సభ్యులు, యువత, స్థానిక నాయకులు చురుకుగా వ్యవహరించాలని ఆమె పిలుపునిచ్చారు. చట్టాలను గౌరవిస్తూ నిబంధనలను కచ్చితంగా పాటించడం ద్వారా మాత్రమే ఈ సామాజిక సమస్యకు అడ్డుకట్ట వేయగలమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కోఆర్డినేటర్ మనోజ్ కుమార్, కమ్యూనిటీ సోషల్ మొబిలైజర్ అజిత్ తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: