ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    బాధిత కుటుంబానికి అండగా యువ నాయకుడు రాపాక ప్రశాంత్

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు1 నవంబర్, 202605:47 AM

    ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు గ్రామ యువ నాయకుడు రాపాక ప్రశాంత్. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన గాదరి వెంకటమ్మ ఇటీవల అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందారు.

    బాధిత కుటుంబానికి అండగా యువ నాయకుడు రాపాక ప్రశాంత్
    రాయపర్తి, నవంబర్ 1ప్రజాధ్వని : ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు గ్రామ యువ నాయకుడు రాపాక ప్రశాంత్. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన గాదరి వెంకటమ్మ ఇటీవల అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాపాక ప్రశాంత్ ఆదివారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి 25 కేజీల బియ్యంతో పాటు ఆర్థిక సహాయం అందజేసి తమ వంతు అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: