పల్లగుట్టలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు29 అక్టోబర్, 202601:24 PM
ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆదేశాల మేరకు బుధవారం పల్లగుట్ట గ్రామంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.

చిల్పూర్, అక్టోబరు 28 (ప్రజాధ్వని): స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య సూచనల మేరకు చిల్పూర్ దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు ఆధ్వర్యంలో చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటు హక్కు కలిగిన అర్హులైన పట్టభద్రులు తప్పనిసరిగా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎనగందుల నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ ఎండీ రఫీ, గ్రామ శాఖ అధ్యక్షుడు ఇసురం శ్రీనివాస్, దేవస్థాన డైరెక్టర్ ఎనగందుల రత్నాకర్‌రెడ్డి, మర్రి దుర్గాప్రసాద్, వెంకట్‌రెడ్డి, కుంచాల రాజు, లింగన్న, చిల్పూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇసురం కృష్ణ, జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి మనోజ్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
