ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    భార్య కాపురానికి రావడం లేదని.. విద్యుత్‌ టవర్‌ ఎక్కిన యువకుడు

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు5 అక్టోబర్, 202610:17 AM
    భార్య కాపురానికి రావడం లేదని.. విద్యుత్‌ టవర్‌ ఎక్కిన యువకుడు
    రాయపర్తి, అక్టోబర్‌ 5, ప్రజాధ్వని: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు విద్యుత్‌ టవర్‌ ఎక్కి ఆందోళనకు దిగాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అతడిని కిందకు దించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం నర్సింగాపురం శివారులోని తండాకు చెందిన భూక్య రవికి.. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం జింకురాం తండాకు చెందిన బద్రితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆరు నెలల కుమారుడు ఉన్నాడు. అయితే భార్యను కాపురానికి పంపించే విషయంలో అత్తింటి కుటుంబ సభ్యులు కొన్నేళ్లుగా తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని రవి ఆరోపించాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం తనతో గొడవపడ్డారని పేర్కొంటూ.. సోమవారం కోలనుపల్లి శివారులోని విద్యుత్‌ టవర్‌ ఎక్కి ఆందోళనకు దిగాడు. సమాచారం అందుకున్న రాయపర్తి ఎస్సై ముత్యం రాజేందర్‌ వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. రవితో ఫోన్‌లో దాదాపు రెండు గంటలపాటు మాట్లాడి.. సమస్యను పరిష్కరించేందుకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి నచ్చజెప్పారు. దీంతో రవి టవర్‌ నుంచి కిందకు దిగాడు. అనంతరం అతడిని పాలకుర్తి పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: