ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్‌కు శ్రీవారి లడ్డూ ప్రసాదం అందజేత
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు4 అక్టోబర్, 202602:29 PM

రాయపర్తి, అక్టోబర్ 4 (ప్రజాధ్వని): హైదరాబాద్ నందిహిల్స్‌లో తెలంగాణ మాజీ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ఎర్రబెల్లి దయాకర్‌రావును రాయపర్తి మండల బీఆర్‌ఎస్ నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని ఆయనకు అందజేశారు. అనంతరం ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్‌ను కూడా నాయకులు కలిసి శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలు, నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులపై నాయకులు చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల బీఆర్‌ఎస్ నాయకులు చందు రాము యాదవ్, లేతాకుల రంగారెడ్డి, తాళ్లపెల్లి సంతోష్‌గౌడ్, మచ్చ శ్రవణ్, కిరణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.
