ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    15వ వార్డు అధ్యక్షుడిగా ఆదిమల్ల చింతాల్ ఏకగ్రీవం

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు22 సెప్టెంబర్, 202604:28 AM
    15వ వార్డు అధ్యక్షుడిగా ఆదిమల్ల చింతాల్ ఏకగ్రీవం
    స్టేషన్ ఘనపూర్ సెప్టెంబర్ 22 ప్రజాధ్వని :మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అంబటి కిషన్ రాజు గారి ఆధ్వర్యంలో స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో వార్డు అధ్యక్షుడిగా ఆదిమల్ల చింతాల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని సైతం నియమించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వార్డు అధ్యక్షుడు ఆదిమల్ల చింతాల్ మాట్లాడుతూ, తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కి, ఎంపీ కడియం కావ్యకు, కౌన్సిలర్ బొల్లు లక్ష్మికి, 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: