ఎంఎస్‌ఎఫ్ నూతన కళాశాల కమిటీ ఎన్నిక
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు30 సెప్టెంబర్, 202603:22 PM

రాయపర్తి, సెప్టెంబర్ 30 ప్రజాధ్వని: రాయపర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదిగ విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సాగిన ఉద్యమ చరిత్రను విద్యార్థులకు వివరించారు. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణలో భాగంగా అక్టోబర్ 6న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్న మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్‌ఎఫ్) జాతీయ ప్రతినిధుల సభకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన ఎంఎస్‌ఎఫ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బాలుర కమిటీ అధ్యక్షుడిగా మంద అశ్విత్ మాదిగ, అధికార ప్రతినిధిగా నల్ల పురుషోత్తం మాదిగ, ప్రధాన కార్యదర్శిగా కొండేటి సుశాంత్ మాదిగ, ఉపాధ్యక్షుడిగా వశపాక రాజబాబు మాదిగ ఎన్నికయ్యారు. అదేవిధంగా బాలికల కమిటీ అధ్యక్షురాలిగా పాపిడికాయల సాత్విక, అధికార ప్రతినిధిగా నల్ల వైష్ణవి మాదిగ, ప్రధాన కార్యదర్శిగా ఐత శ్రావణి మాదిగ, ఉపాధ్యక్షురాలిగా గారే శాన్వి మాదిగ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమావేశానికి ఎంఎస్‌పీ మాజీ మండల అధ్యక్షుడు, రాయపర్తి మండల ఇన్‌చార్జి వశపాక కుమార్ మాదిగ, కో-ఇన్‌చార్జి బచ్చలి యాకయ్య మాదిగ, కట్ల రామ్ తదితరులు సమన్వయం చేశారు.
