ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    తెలంగాణ

    పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి

    • ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి కాంగ్రెస్ శ్రేణులకు డీసీసీ వైస్ ప్రెసిడెంట్ గుడి వంశీధర్‌రెడ్డి పిలుపు
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు22 అక్టోబర్, 202611:47 AM

    రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సర్వోత్తమ్‌రెడ్డి గెలుపునకు పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని డీసీసీ వైస్ ప్రెసిడెంట్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గుడి వంశీధర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

    పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి
    లింగాలఘణపురం, అక్టోబరు 22 (ప్రజాధ్వని): రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సర్వోత్తమ్‌రెడ్డి గెలుపునకు పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని డీసీసీ వైస్ ప్రెసిడెంట్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గుడి వంశీధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. లింగాలఘణపురం మండలం నెల్లుట్ల గ్రామంలోని తన వ్యక్తిగత కార్యాలయంలో గురువారం మండలంలోని సర్పంచులు, పార్టీ ప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నియమించిన కో-ఆర్డినేటర్ సమక్షంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై సర్పంచులు, పార్టీ ప్రతినిధులతో చర్చించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు అయ్యేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
    పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి - అదనపు చిత్రం 1
    అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వంశీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. లింగాలఘణపురం మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవతో దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను మండలంలోని ప్రతి గ్రామంలోని చెరువులు, కుంటలకు అందించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, 2022 నాటికి డిగ్రీ అర్హత సాధించిన ప్రతి ఒక్కరూ నవంబర్ 6లోగా తమ ఓటును నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియపై యువ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించి అర్హులైన పట్టభద్రులందరినీ గుర్తించి ఓటరు నమోదు చేయించాలని కోరారు. ఇందుకోసం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రామ్‌రెడ్డి దామోదర్‌రెడ్డి కుమారుడు సర్వోత్తమ్‌రెడ్డిని బలపరిచిన అభ్యర్థిగా ప్రకటించిందని వెల్లడించారు. ఇప్పటికే పార్టీ ముఖ్య నాయకులకు అభ్యర్థిని పరిచయం చేసినట్లు తెలిపారు. సర్వోత్తమ్‌రెడ్డి ఉన్నత విద్యావంతుడని, దేశ, విదేశాల్లోని ప్రముఖ సంస్థల్లో పనిచేసిన అనుభవంతో పాటు ఆసియా ఖండంలోనే అతిపెద్ద బ్యాంకులో రీజినల్ మేనేజర్‌గా సేవలందించారని వివరించారు. అనంతరం తన తండ్రి అడుగుజాడల్లో ప్రజాసేవకు అంకితమై కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
    పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి - అదనపు చిత్రం 2
    మండలంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యతగా వ్యవహరించి ఒక్క అర్హుడిని కూడా వదలకుండా పట్టభద్రుల ఓటరు నమోదును పూర్తి చేయించాలని, పార్టీ ప్రకటించే కార్యాచరణకు అనుగుణంగా ముందుకు సాగుతూ సర్వోత్తమ్‌రెడ్డి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యదర్శి, మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లూరి శివకుమార్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నర్సింగ రామకృష్ణ, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: