కాంగ్రెస్ పట్టణ అధికార ప్రతినిధిగా పోశాల కృష్ణమూర్తి
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు22 సెప్టెంబర్, 202603:10 AM

స్టేషన్ ఘనపూర్ సెప్టెంబర్ 21 ప్రజాధ్వని: స్టేషన్ ఘనపూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పోశాల కృష్ణమూర్తి నియమితులయ్యారు. పార్టీ కోసం నిత్యం కృషి చేస్తున్న ఆయన సేవలను గుర్తించి పార్టీ అధిష్టానం ఈ మేరకు నియమించింది. పట్టణంలో పార్టీ కార్యక్రమాలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం ఇవ్వడంలో కృష్ణమూర్తి కీలక పాత్ర పోషిస్తారని నాయకులు ఆకాంక్షించారు. తనకు పట్టణ అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి, ఎంపీ కడియం కావ్య కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన మునిసిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ కు, పట్టణ అధ్యక్షుడు అంబటి కిషన్ రాజు కు, ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పోశాల కృష్ణమూర్తిని పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని కృష్ణమూర్తి తెలిపారు.
