ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    కేసీఆర్‌కు కృతజ్ఞతగా భారీ బైక్ ర్యాలీ

    • జనగామ జిల్లా అభివృద్ధికి కొత్త జిల్లాల ఏర్పాటు దోహదం
    • మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు12 అక్టోబర్, 202606:00 AM
    కేసీఆర్‌కు కృతజ్ఞతగా భారీ బైక్ ర్యాలీ
    స్టేషన్ ఘనపూర్, ప్రజాధ్వని ప్రతినిధి: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుతోనే జనగామ జిల్లా అభివృద్ధికి బాటలు పడ్డాయని మాజీ ఉప ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. జిల్లాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఆధ్వర్యంలో స్టేషన్ ఘనపూర్ నుంచి జనగామ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. జిల్లాల ఏర్పాటు ఫలితంగానే జనగామ జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. జనగామ జిల్లా ప్రజల తరఫున కేసీఆర్‌కు రుణపడి ఉంటామని తెలిపారు. ర్యాలీలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బైక్‌లపై జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు. మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం సభ్యులు ర్యాలీలో పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: