జఫర్‌గడ్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా కలకోట అనిల్‌కుమార్
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు31 ఆగస్టు, 202602:25 PM

జఫర్‌గడ్ ఆగష్టు 31 ప్రజాధ్వని: కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జఫర్‌గడ్ మండల అధ్యక్షుడిగా తీగారం మాజీ ఉపసర్పంచ్ కలకోట అనిల్‌కుమార్‌ను నియమించినట్లు ఆయన తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. తనను ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా నియమించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి అనిల్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
