ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    బూత్ లెవెల్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు4 జులై, 202604:12 PM
    బూత్ లెవెల్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి
    చిల్పూర్ జులై 04 ప్రజాధ్వని : జనగామ జిల్లా చిల్పూర్ మండలం శ్రీపతిపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA) సమావేశంలో తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి బూత్‌లో బూత్ లెవెల్ ఏజెంట్ కమిటీలను పటిష్టంగా ఏర్పాటు చేసి ఇంటింటికీ వెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా చెప్పుకోదగ్గ పథకం అమలు కాలేదని ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
    బూత్ లెవెల్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి - అదనపు చిత్రం 1
    కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, డబుల్ ఎంట్రీల సవరణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించిన ఆయన, ఒక్క ఓటు కూడా వృథా కాకుండా చూసే బాధ్యత BLAలపై ఉందన్నారు. బూత్ స్థాయిలో పార్టీ బలోపేతమే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి బూత్‌కు ఇద్దరు బూత్ లెవెల్ ఏజెంట్లతో పాటు మరో ఎనిమిది మంది చురుకైన కార్యకర్తలతో పది మంది బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని కోరారు.
    బూత్ లెవెల్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి - అదనపు చిత్రం 2
    "ఈరోజు బూత్ లెవెల్ ఏజెంట్లుగా పనిచేసేవారే రేపటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం ఉంది" అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. పార్టీ పునర్నిర్మాణానికి బూత్ కమిటీలే బలమైన పునాదిగా నిలుస్తాయని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
    బూత్ లెవెల్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి - అదనపు చిత్రం 3
    పార్టీ బలోపేతం కోసం సభ్యత్వ నమోదు, కొత్త ఓటర్ల చేర్పు, ఓటరు జాబితా పరిశీలన వంటి కార్యక్రమాలను వేగవంతం చేయాలని డా. రాజయ్య సూచించారు. బూత్ స్థాయిలో పార్టీ బలపడితే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ మరింత పటిష్టమవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ కేతిరెడ్డి మనోజ్ రెడ్డి, మండల ఇంచార్జ్ రమేష్ నాయక్, మాజీ మార్కెట్ డైరెక్టర్ రాజన్ బాబు, సర్పంచ్ లు మోటం రాజు,గుగులోతు దేవేందర్ నాయక్, మాజీ సర్పంచ్ లోడెం రవీందర్, ప్రవీణ్, బాలస్వామి, నాగరాజ్, ఎడ్ల మహిపాల్, గడ్డమీది మహేందర్,చుక్క రాజేష్, మోతె సురేష్,పల్లపు తిరుపతి, బొల్లు బిక్షపతి, రచ్చ రవీందర్, నారగోని రాజు, పిట్టల మహేందర్, కలుకోళ్ల చోక్కయ్య, బత్తిని శ్రీనివాస్, వేల్పుల గట్టయ్య,మర్రి శ్రీధర్,ఎండీ యాకుబ్, రంగు రవి తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: