ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు28 అక్టోబర్, 202612:27 PM

    అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రఘునాథపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు పుప్పాల వేణు కుమార్ నేతృత్వంలో చేపట్టిన ఈ ఆందోళనలో…

    లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని
    రఘునాథపల్లి అక్టోబర్ 28 ప్రజాధ్వని: అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రఘునాథపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు పుప్పాల వేణు కుమార్ నేతృత్వంలో చేపట్టిన ఈ ఆందోళనలో అర్హులైన పేద కుటుంబాలకు న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అన్యాయం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అనర్హులకు ఇళ్లు కేటాయించినట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్లు కేటాయించే ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని, అర్హులైన వారికి న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. పేదలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: