తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సద్దుల బతుకమ్మ
- ఆడబిడ్డలకు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య శుభాకాంక్షలు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు17 అక్టోబర్, 202603:50 PM
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవానికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆకాంక్షించారు.

హనుమకొండ, అక్టోబర్ 17ప్రజాధ్వని : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవానికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆకాంక్షించారు. పండుగను పురస్కరించుకుని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా ఆడబిడ్డలకు ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని ఆరాధిస్తూ, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెబుతోందని కడియం కావ్య పేర్కొన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో బతుకమ్మ పండుగ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. తీరొక్క పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మల చుట్టూ ఆడబిడ్డలు ఆటపాటలతో, ఆనందోత్సాహాల మధ్య సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. సద్దుల బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా సంతోషాలను నింపాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని కోరుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవం కలకాలం కొనసాగాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆకాంక్షించారు.
