ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    ఉప్పుగల్‌ పాఠశాలలో ఆధునిక డైనింగ్‌ హాల్‌

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు28 ఆగస్టు, 202605:32 AM
    ఉప్పుగల్‌ పాఠశాలలో ఆధునిక డైనింగ్‌ హాల్‌
    జాఫర్‌గఢ్‌, ఆగస్టు 27 (ప్రజాధ్వని): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో సుస్త్రో కంపెనీ చేపడుతున్న సీఎస్‌ఆర్‌/సీఈఆర్‌ కార్యక్రమంలో భాగంగా ఉప్పుగల్‌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఆధునిక డైనింగ్‌ హాల్‌ను ఏర్పాటు చేశారు. ఇరా గురుకుల్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ డైనింగ్‌ హాల్‌ ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేసేందుకు సౌకర్యవంతమైన, పరిశుభ్రమైన వాతావరణం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు ఎండ, వర్షం వంటి వాతావరణ పరిస్థితుల్లో భోజనం చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఈ హాల్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఉపాధ్యాయులు తెలిపారు. చిన్నారులు ప్రశాంతంగా, క్రమపద్ధతిలో భోజనం చేసేందుకు అనువుగా హాల్‌ను ఆధునిక హంగులతో తీర్చిదిద్దారు. పాఠశాల పరిసరాల్లో పరిశుభ్రతను కాపాడటంతో పాటు విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించేందుకు ఈ వసతి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యేకంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రాథమిక స్థాయిలోనే విద్యపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు విద్యార్థుల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, క్రమశిక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని నిర్వాహకులు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు మెరుగైన వసతులు కల్పించడంలో కార్పొరేట్‌ సంస్థల సీఎస్‌ఆర్‌/సీఈఆర్‌ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన సుస్త్రో కంపెనీ యాజమాన్యానికి, కార్యక్రమాన్ని అమలు చేసిన ఇరా గురుకుల్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ ప్రతినిధులకు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ పాఠశాలకు అవసరమైన ఇతర మౌలిక వసతుల కల్పనకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సుస్త్రో కంపెనీ ప్రతినిధులు సంతోష్‌ జగ్ధని, సురేష్‌ రోండా, సుబ్బారెడ్డి, విజయ్‌కుమార్‌ నాయర్‌, డాక్టర్‌ కుమార్‌రాజ్‌, ధనవర్మ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి.సాయికుమారి, జిల్లా ప్రజాపరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఫర్హాత్‌ కౌసర్‌, ఉపాధ్యాయులు బి.గోపి, పి.శివరాణి, అనుజరాణి, సునీత, శ్రీనివాస్‌, కల్పన తదితరులు పాల్గొన్నారు.
    ఉప్పుగల్‌ పాఠశాలలో ఆధునిక డైనింగ్‌ హాల్‌ - అదనపు చిత్రం 2
    ఉప్పుగల్‌ పాఠశాలలో ఆధునిక డైనింగ్‌ హాల్‌ - అదనపు చిత్రం 3
    మీ స్పందన:

    షేర్ చేయండి: