కార్మికుల సమస్యలపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య కీలక ప్రసంగం
- ఐక్యతతో ముందుకు సాగాలని BNRKS సమావేశంలో పిలుపు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు20 సెప్టెంబర్, 202602:30 PM

స్టేషన్ ఘన్పూర్ 20 సెప్టెంబర్ ప్రజాధ్వని : భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం (BNRKS) ఆధ్వర్యంలో స్టేషన్ ఘన్పూర్ లోని ZPHS గర్ల్స్ హై స్కూల్ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలు, హక్కులు, సంక్షేమంపై ఆయన మాట్లాడారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో BNRKS అధ్యక్షులు, ఘన్పూర్ మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ తాటికొండ మధు, కార్మిక సంఘం ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
