ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    14వ వార్డు రైల్వే కాలనీలో విఘ్నేశ్వర యూత్ అద్భుతం

    • 41 రకాల నైవేద్యాలతో గణనాథుడికి మహా పూజ
    • లంబోదరుడికి ఇష్టమైన ప్రసాదాలతో ఘనంగా పూజలు*
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు23 సెప్టెంబర్, 202604:48 AM
    14వ వార్డు రైల్వే కాలనీలో విఘ్నేశ్వర యూత్ అద్భుతం
    స్టేషన్ ఘనపూర్ సెప్టెంబర్ 23 ప్రజాధ్వని : మున్సిపాలిటీలోని 14వ వార్డు రైల్వే కాలనీ, విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో మంగళవారం భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. ఈ మండపంలో మహిళలు తమ భక్తిని చాటుకుంటూ 41 రకాల నైవేద్యాలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లంబోదరుడికి ఎంతో ఇష్టమైన లడ్డూలు, ఉండ్రాళ్ళు, పులిహోర, అన్నం, పాయసం, పండ్లు, వడపప్పు, చలిమిడి సహా 41 రకాల ప్రసాదాలను స్వామి వారి ముందు ఉంచి ఘనంగా పూజించారు. మండపం మొత్తం నైవేద్యాలతో కనుల పండుగగా మారింది.
    14వ వార్డు రైల్వే కాలనీలో విఘ్నేశ్వర యూత్ అద్భుతం - అదనపు చిత్రం 1

    చాగల్లు లో మహా అన్నదానం:....

    మున్సిపాలిటీ పరిధిలోని మార్కండేయ పద్మశాలి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపంలో 8వ వార్డు కౌన్సిలర్ పొన్న రాజేష్ రజిత ఆధ్వర్యంలో మహా అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా మండపం వద్ద భక్తుల కోలాహలం, భజనలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.ఈ కార్యక్రమంలో ఆరవ వార్డు కౌన్సిలర్ అనిల్ గౌడ్, కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
    14వ వార్డు రైల్వే కాలనీలో విఘ్నేశ్వర యూత్ అద్భుతం - అదనపు చిత్రం 3
    మీ స్పందన:

    షేర్ చేయండి: