ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తా _ సర్పంచ్ లావణ్యమల్లారెడ్డి

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు3 ఏప్రిల్, 202603:01 AM
    అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తా _ సర్పంచ్ లావణ్యమల్లారెడ్డి
    చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో గ్రామసభలో గ్రామస్తులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సర్పంచ్ ఎడవెల్లి లావణ్య మల్లారెడ్డి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి లైట్లు, పింఛన్లు, రేషన్ తదితర సమస్యలపై గ్రామస్తులు అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, చాలా కాలంగా కొన్ని సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్య, రోడ్ల దుస్థితి, తాగునీటి సరఫరా సమస్యను అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. గ్రామస్తుల సమస్యలను విన్న అధికారులు స్పందిస్తూ, సమస్యలను దశలవారీగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎడవెల్లి లావణ్య మల్లారెడ్డి మాట్లాడుతూ, గ్రామ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులతో సమన్వయం చేస్తామని, వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే గ్రామ అభివృద్ధికి మరింత అభివృద్ధి నిధులు తీసుకొచ్చే దిశగా కృషి చేస్తామని, గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. అనంతరం గ్రామంలో చలివేంద్రం ప్రారంభించారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: