నూతనంగా సీఐ బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్‌కు సన్మానం
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు3 అక్టోబర్, 202602:02 AM

స్టేషన్‌ఘన్‌పూర్, అక్టోబరు 2 (ప్రజాధ్వని): స్టేషన్‌ఘన్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో నూతనంగా సీఐగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్‌ను సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ప్రతినిధులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్‌ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు పోలీస్‌శాఖ మరింత చేరువగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కమిటీ ప్రతినిధులు ఆకాంక్షించారు. పోలీస్‌శాఖ, ప్రజలు, సామాజిక సంస్థల మధ్య సమన్వయం పెంపొందితే నేరాల నియంత్రణతో పాటు ప్రజల్లో భద్రతా భావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జనగామ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ జావిద్, స్టేషన్‌ఘన్‌పూర్ మండల అధ్యక్షుడు మహమ్మద్ సలీం, మహమ్మద్ సోహెల్, కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంభం రాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
