బీఎస్పీ వరంగల్ పార్లమెంట్ ఇంచార్జిగా జలగం ప్రవీణ్
- పార్టీ బలోపేతానికి కృషి చేస్తా.. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తా
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు19 నవంబర్, 202610:36 AM
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జిగా జలగం ప్రవీణ్ నియమితులయ్యారు. బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్, చీఫ్ జోన్-2 కోఆర్డినేటర్ దాగిళ్ల దయానందరావు ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు.

జనగామ, నవంబర్ 19 (ప్రజాధ్వని): బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జిగా జలగం ప్రవీణ్ నియమితులయ్యారు. బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్, చీఫ్ జోన్-2 కోఆర్డినేటర్ దాగిళ్ల దయానందరావు ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా జలగం ప్రవీణ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బహుజన సమాజ అభ్యున్నతి, పార్టీ సిద్ధాంతాలు, ఆశయాల సాధన కోసం అంకితభావంతో పనిచేస్తానన్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని, నూతన ప్రయాణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సహకరించాలని కోరారు. బహుజన హితం, సమాజ అభ్యున్నతి, సమానత్వమే లక్ష్యంగా ముందుకు సాగుతానని జలగం ప్రవీణ్ వెల్లడించారు.
