స్టేషన్ ఘనపూర్‌లో టీఆర్ఎస్ సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ పోస్టర్ ఆవిష్కరణ
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు4 ఆగస్టు, 202610:53 AM

స్టేషన్ ఘనపూర్: టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న "సంకల్ప సభ " కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో నియోజకవర్గ ఇన్‌చార్జి చిలుక ప్రవీణ్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కల్వకుంట్ల కవిత నాయకత్వంలో సరూర్‌నగర్‌లో నిర్వహించే సభతో సంకల్ప సభకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, ప్రజల సమస్యలు, బీసీ రాజ్యాధికారం, ఉద్యోగాల కల్పన వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ సభ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సంకల్ప సభను తీసుకెళ్లి ప్రజలతో మమేకం అవుతామని తెలిపారు. స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో చిలుక ప్రశాంత్, చిలుక కిషోర్, బొడ్డు భరత్, బొడ్డు వినోద్, మాచర్ల కుమార్, వరదాచారి, గాదె ప్రణయ్, ఈ. సుధాకర్, ఇసురం రవీందర్, శశి, నరేష్, తుండి ప్రశాంత్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
