ఎంగిలిపూల బతుకమ్మ ఆట స్థలాన్ని పరిశీలించిన సర్పంచ్
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు9 అక్టోబర్, 202604:41 PM

రాయపర్తి, అక్టోబర్ 9 ప్రజాధ్వని: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిర్మలాయపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద నిర్వహించనున్న ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల ప్రాంగణాన్ని గ్రామ సర్పంచ్ బరిగల బాబు సందర్శించారు. ఈ సందర్భంగా వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామంలోని ప్రతి వీధిలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మైస విక్రమ్, వార్డు సభ్యులు గడ్డం నరేందర్, కేతిరెడ్డి వేణు, దోకుడు సోమేందర్, కారోబార్ మహంకాళి రత్నాకర్, గ్రామస్తులు చిక్కుడు శ్రీనివాస్, దొంతరబోయిన సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
