చిల్పూర్లో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు15 ఏప్రిల్, 202604:00 PM

చిల్పూర్ ఏప్రిల్ 15 ప్రజాధ్వని :
చిల్పూర్ మండల కేంద్రంలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ అనిత నవీన్, మాజీ ఎంపీపీ సరిత బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారుల మోసాలకు గురికాకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ప్రభుత్వం కల్పించిన ఈ సౌకర్యాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో విజయ్, మండల పార్టీ అధ్యక్షుడు గడ్డమీది సురేష్, మల్కాపూర్ సర్పంచ్ లావణ్య మల్లారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


