ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    నెత్తికి తగిలేలా వేలాడుతున్న కరెంటు వైర్లు..

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు25 జూన్, 202610:36 AM
    నెత్తికి తగిలేలా వేలాడుతున్న కరెంటు వైర్లు..
    స్టేషన్ ఘనపూర్ , జూన్ 25 ప్రజాధ్వని :స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల వెనుక ఉన్న బోరు బావుల విద్యుత్ లైన్లు ప్రమాదకరంగా మారాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ తీగలు నేలకు కేవలం ఐదు అడుగుల ఎత్తులో వేలాడుతూ ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని వారు వాపోతున్నారు. వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే రైతులు, ఆ ప్రాంతంలో సంచరించే పశువులు ఈ తీగల కారణంగా ప్రాణాపాయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. పలుమార్లు సంబంధిత లైన్‌మెన్‌తో పాటు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రమాదం జరిగే వరకు అధికారులు స్పందించరా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా విషాదం జరిగిన తర్వాత హడావుడి చేయడం కాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను వెంటనే సరిచేసి, అవసరమైన చోట కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
    నెత్తికి తగిలేలా వేలాడుతున్న కరెంటు వైర్లు.. - అదనపు చిత్రం 2
    మీ స్పందన:

    షేర్ చేయండి: