ఈవీ బైక్ షో రూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు20 ఏప్రిల్, 202608:19 AM

స్టేషన్ ఘనపూర్, ఏప్రిల్ 20 (ప్రజాధ్వని):
స్టేషన్ ఘనపూర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల షోరూమ్‌ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి షోరూమ్‌ను ప్రారంభించిన ఆయన, ప్రదర్శనలో ఉంచిన ఈవీ వాహనాలను పరిశీలించి వాటి పనితీరును యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులకు నాణ్యమైన వాహనాలతో పాటు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ఈవీ వాహనాల వినియోగం అవసరమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
