తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఉప సర్పంచ్ సద్దాం హుస్సేన్
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు6 ఆగస్టు, 202603:18 PM

వేలేరు, ఆగస్టు 6 ప్రజాధ్వని : బంజారా గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే తీజ్ పండుగ వేడుకలు వేలేరు మండలం కమ్మరిపేట గ్రామ తండాలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ ఉప సర్పంచ్ సద్దాం హుస్సేన్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తీజ్ పండుగ బంజారా గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు పరిచయం చేసే గొప్ప పండుగ అని అన్నారు. ఇటువంటి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ సంరక్షించి, కొనసాగించాలని పిలుపునిచ్చారు.

జరుపుల, లావుడ్యా, మురావత్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో బంజారా యువతులు, మహిళలు తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పెంచిన గోధుమ మొలకల బుట్టలను తలపై మోసుకుంటూ సంప్రదాయ నృత్యాలు చేశారు. వారితో కలిసి మాజీ ఉప సర్పంచ్ సద్దాం హుస్సేన్ కూడా నృత్యం చేస్తూ ఉత్సవాల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జోడుముంతల కిరణ్, ఉప సర్పంచ్ సురేష్, కమ్మరిపేట కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు జరుపుల రమేష్, లింగయ్య, కార్తీక్, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
