ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    తానేదార్‌పల్లిలో ఫ్లెక్సీ వివాదం

    • సర్పంచ్‌పై బీఆర్ఎస్ వార్డు సభ్యుల ఆగ్రహం.. ఫొటోలు కత్తిరించారని ఆరోపణలు
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు18 అక్టోబర్, 202606:13 AM

    జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తానేదార్‌పల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ, దసరా, దీపావళి శుభాకాంక్షల ఫ్లెక్సీ వివాదానికి దారితీసింది.

    తానేదార్‌పల్లిలో ఫ్లెక్సీ వివాదం
    స్టేషన్ ఘనపూర్,అక్టోబర్18 ప్రజాధ్వని: జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తానేదార్‌పల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ, దసరా, దీపావళి శుభాకాంక్షల ఫ్లెక్సీ వివాదానికి దారితీసింది. తమ అనుమతి లేకుండా ఫ్లెక్సీలో ఫొటోలు ముద్రించడమే కాకుండా, అనంతరం వాటిని బ్లేడ్‌తో కత్తిరించారని బీఆర్ఎస్‌కు చెందిన పలువురు వార్డు సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ సర్పంచ్ మంతెన హారిత–ఇంద్రసేనారెడ్డి తమకు తెలియకుండా వార్డు సభ్యుల ఫొటోలను ఫ్లెక్సీలో ముద్రించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన తర్వాత కావాలనే తమ ఫొటోలను కత్తిరించి అవమానించారని మండిపడ్డారు. ఫ్లెక్సీలో గ్రామ పాలకవర్గానికి సంబంధంలేని బెల్ది వెంకన్నతో పాటు ఇతరుల ఫొటోలను కూడా ముద్రించారని వారు పేర్కొన్నారు. మంతెన మౌనిక, భాస్క్యాల వేంకటయ్య, ఉప్పున నవీన్, ఆకుల క్రిష్ణరాజు, మేకల రజిత–ప్రవీణ్, వార్డు సభ్యుల సంఘం మండల అధ్యక్షుడు గుండె రంజిత్, చుక్క రేణుక–ఆనంద్ తదితరుల పేర్లు ఈ వివాదంలో ప్రస్తావనకు వచ్చాయి. తమ అనుమతి లేకుండా ఫొటోలు ముద్రించడం ఒక ఎత్తయితే, వాటిని కత్తిరించడం మరింత అవమానకరమని వార్డు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా, ఘటనకు సంబంధించి ఇరువైపుల వాదనలు, అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.
    మీ స్పందన:

    షేర్ చేయండి: