మత్తడి పోస్తున్న వెంకటాద్రి చెరువు… రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు4 ఏప్రిల్, 202607:57 AM

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పల్లగుట్ట గ్రామానికి చెందిన వెంకటాద్రి చెరువు ఎండాకాలంలోనూ మత్తడి పోస్తుండటం స్థానిక రైతులకు ఊరటనిచ్చింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశాల మేరకు, శ్రీ బుగుల వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు ఆధ్వర్యంలో చెరువు నింపే పనులు చేపట్టారు. చెరువు నిండుగా నీటితో కళకళలాడుతుండటంతో పల్లగుట్ట రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగు నీటి సమస్యలు కొంతవరకు పరిష్కారం కావడంతో ఈ వేసవిలో పంటలపై నమ్మకం పెరిగిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ రఫీ, గ్రామ శాఖ అధ్యక్షుడు రాజు, దేవస్థానం డైరెక్టర్ రత్నాకర్ రెడ్డి, మాజీ PACS వైస్ చైర్మన్ నాగరాజు, సంపత్ రాజు, రమేష్, వెంకన్న, అశోక్ పాల్, శ్రీను, రాజు, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
పల్లగుట్ట గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అలాగే కార్యక్రమాన్ని సమర్థంగా ముందుకు నడిపించిన పొట్లపల్లి శ్రీధర్ రావుకు గ్రామస్తులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
