ఎల్కుర్తిలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు సిద్ధం
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు13 ఏప్రిల్, 202606:02 AM

హన్మకొండ జిల్లా, ధర్మసాగర్ మండలం పరిధిలోని ఎల్కుర్తి గ్రామంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రామస్తులు, ప్రజల సహకారంతో నిర్మించిన ఈ విగ్రహాన్ని ఈ నెల 16వ తేదీన ఘనంగా ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు యువత, పెద్దలు సమిష్టిగా కృషి చేస్తున్నారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలిచిన అంబేద్కర్ విగ్రహం గ్రామానికి మరింత గౌరవాన్ని తీసుకురానుందని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
