తాటికొండ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా మారపాక నగేష్
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు17 ఆగస్టు, 202603:34 PM

స్టేషన్‌ఘన్‌పూర్, ఆగస్టు 17 ప్రజాధ్వని : స్టేషన్ ఘనపూర్ మండలంలోని తాటికొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షుడిగా మారపాక నగేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ శాఖ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గ్రామ సర్పంచ్ మారపాక సుజన శ్రీనివాస్ తెలిపారు. నూతన కమిటీలో ఉపాధ్యక్షుడిగా ఎండీ అక్బర్, ప్రధాన కార్యదర్శిగా రొయ్యల దూమయ్య, కార్యదర్శిగా మూసిని రాజయ్య, ప్రచార కార్యదర్శిగా మొగ్గం కృష్ణంరాజు, సహాయ కార్యదర్శిగా చంద్రు నాయక్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ మారపాక సుజన శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నూతన కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు చేరేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బేతి జయపాల్‌రెడ్డి, కోఆపరేటివ్ పీఎస్‌సీఎస్ చైర్మన్ దూదిపాల నరేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ మార్కరాజమ్మ శ్రీనివాస్‌గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ మారపాక వసంత్, 8వ వార్డు సభ్యురాలు దుబ్బాక నవ్య నాగరాజు, 7వ వార్డు సభ్యురాలు నలిమెల కోమలాత ఏలియా, 5వ వార్డు సభ్యుడు మారపాక వైఎస్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు బర్మ మల్లేశం, చాడ రాజకుమార్, ఎండీ మోసిన్ అలీ, యాదగిరి, మారపాక యాదగిరి, రమేష్, ఎన్టీఆర్, వక్కల ఉమాగొన్ని యాకయ్యగౌడ్, రాజు రాజారపు, మల్లేశం, బట్టు ఎల్లయ్య, తాటికల రాజు, రాకేష్, రాజారపు మల్లేశం, సురేష్, ఈశ్వర్, ప్రమోద్, సుధాకర్, శ్రీనాథ్, ప్రీతం, రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
