ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    తెలంగాణ

    పేదల పెన్నిధి పండుగ సాయన్న

    • సాయన్న ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌రెడ్డి
    • ఘనంగా పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలు..
    • విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు22 అక్టోబర్, 202601:37 PM

    తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన ప్రజావీరుడు పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలను షాద్‌నగర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌రెడ్డి పాల్గొని సాయన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

    పేదల పెన్నిధి పండుగ సాయన్న
    షాద్‌నగర్‌, అక్టోబరు 22 (ప్రజాధ్వని): తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన ప్రజావీరుడు పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలను షాద్‌నగర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌రెడ్డి పాల్గొని సాయన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటి నిరంకుశ పాలనలో భూస్వాములు, పెత్తందారుల దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలిచిన ధైర్యశాలి పండుగ సాయన్న అని కొనియాడారు. పేదల ఆకలి తీర్చిన మానవతావాదిగా, బడుగు బలహీన వర్గాల పక్షాన నిలిచిన ప్రజావీరుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. పాలమూరు గడ్డపై పుట్టిన సాయన్న పోరాట ప్రస్థానం నేటికీ జానపదుల గుండెల్లో సజీవంగా ఉందన్నారు. సామాజిక న్యాయం కోసం సాయన్న సాగించిన పోరాటాలు, ఆయన ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొంటూ.. యువత ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని సమాజ హితం కోసం ముందుకు సాగాలని ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
    పేదల పెన్నిధి పండుగ సాయన్న - అదనపు చిత్రం 1
    ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అనిత రఘునాథ్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు కానుగు అనంతయ్య, చింటూ ప్రతాప్‌రెడ్డి, నందకిషోర్, చిన్న యాదగిరి, పాలమాకుల చెన్నయ్య, ముదిరాజ్ సంఘం నాయకులు మంగ వెంకటేష్, అంచె రాములు, అందె పైలయ్య, చెట్ల వెంకటేష్, మేకల వెంకటేష్, బాలరాజ్, దినేష్ సాగర్, మంగ మధు, మల్లేష్, యువకులు తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: