ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    తెలంగాణ

    రాకెట్‌ దూసుకెళ్లడంతో బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు8 నవంబర్, 202603:14 PM

    దీపావళి సంబరాల వేళ హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌ పరిధిలోని నామాలగుండులో స్థానికులు కాల్చిన రాకెట్‌ అదుపుతప్పి సమీపంలోని బాణసంచా దుకాణంలోకి దూసుకెళ్లింది.

    రాకెట్‌ దూసుకెళ్లడంతో బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
    హైదరాబాద్ , నవంబర్ 8 (ప్రజాధ్వని): దీపావళి సంబరాల వేళ హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌ పరిధిలోని నామాలగుండులో స్థానికులు కాల్చిన రాకెట్‌ అదుపుతప్పి సమీపంలోని బాణసంచా దుకాణంలోకి దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి దుకాణంలోని బాణసంచాకు అంటుకున్నాయి. క్షణాల్లోనే పటాకులు భారీ శబ్దాలతో పేలడంతో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. పేలుళ్ల ధాటికి ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేయగా, మంటలు దుకాణం మొత్తం వ్యాపించాయి. ఈ హఠాత్పరిణామంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో బాణసంచా దుకాణం పూర్తిగా దగ్ధమై బూడిదైనట్లు తెలుస్తోంది. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. దీపావళి వేడుకల్లో బాణసంచా కాల్చే సమయంలో తీసుకునే చిన్నపాటి నిర్లక్ష్యం ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. జనసంచారం ఉన్న ప్రాంతాలకు, బాణసంచా దుకాణాలకు దూరంగా టపాసులు కాల్చాలని, రాకెట్లు వదిలే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: