సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ రఘునాథ్‌పల్లి మండల అధ్యక్షుడిగా కుకుడాల కిరణ్ కుమార్
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు4 జులై, 202608:25 AM

జనగామ జులై 04 ప్రజాధ్వని : సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ రఘునాథ్‌పల్లి మండల అధ్యక్షుడిగా కుకుడాల కిరణ్‌ను జిల్లా కమిటీ నియమించింది. రాష్ట్ర అధ్యక్షుడు ఎలిగండ్ల వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ జావీద్ పాషా నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా జావీద్ పాషా మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించే కీలక సాధనమని అన్నారు. ప్రజల్లో చట్టంపై అవగాహన కల్పించి, వారి హక్కుల పరిరక్షణకు సమర్థవంతంగా పనిచేస్తారనే నమ్మకంతో కుకుడాల కిరణ్‌ను మండల అధ్యక్షుడిగా నియమించినట్లు తెలిపారు. నూతన మండల అధ్యక్షుడు కుకుడాల కిరణ్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సమాచార హక్కు చట్టాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తానని, ప్రజా సమస్యల పరిష్కారంలో చట్టాన్ని సమర్థవంతంగా వినియోగించేలా కృషి చేస్తానని చెప్పారు. కమిటీ ఆశయాలకు అనుగుణంగా సంస్థ బలోపేతానికి నిబద్ధతతో పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా మాజీ అధ్యక్షుడు గోపాల్ దాస్ ఉపేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి బైరి భరత్ కుమార్‌కు కిరణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కుకుడాల కిరణ్ నియామకాన్ని కమిటీ నాయకులు, సభ్యులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు స్వాగతించి శుభాకాంక్షలు తెలిపారు.
