ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    మానస–వాసు గౌడ్ దంపతుల గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు19 ఆగస్టు, 202608:15 AM
    మానస–వాసు గౌడ్ దంపతుల గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
    చిల్పూర్ ఆగష్టు 19 ప్రజాధ్వని: చిల్పూర్ మండల కేంద్రానికి చెందిన గొల్లపల్లి మానస–వాసు గౌడ్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం డైరెక్టర్‌గా సేవలందిస్తున్న వాసు గౌడ్, ఆయన సతీమణి మానస దంపతులు నూతన గృహంలో నిర్వహించిన ఈ శుభకార్యానికి స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి నూతన గృహాన్ని సందర్శించి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మానస–వాసు గౌడ్ దంపతులకు గృహప్రవేశ శుభాకాంక్షలు తెలిపారు. నూతన గృహంలో వారు కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ప్రశాంతమైన జీవితం గడపాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
    మానస–వాసు గౌడ్ దంపతుల గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి - అదనపు చిత్రం 1
    తమ గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆశీర్వదించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మానస–వాసు గౌడ్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గృహప్రవేశ వేడుకకు గ్రామ పెద్దలు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు హాజరై మానస–వాసు గౌడ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన గృహం ఎల్లప్పుడూ ఆనందం, ఐశ్వర్యం, సుఖసంతోషాలతో నిండాలని వారు ఆకాంక్షించారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: