ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    ZPHS స్టేషన్ ఘనపూర్ లో ఘనంగా హిందీ దివస్ వేడుకలు

    • హిందీ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు19 సెప్టెంబర్, 202604:43 PM
    ZPHS స్టేషన్ ఘనపూర్ లో ఘనంగా హిందీ దివస్ వేడుకలు
    స్టేషన్ ఘనపూర్ సెప్టెంబర్ 19 ప్రజాధ్వని : మండలంలోని ZPHS స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం హిందీ దివస్ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు హిందీ కవుల పరిచయాలు, కవితా గానం, ఉపన్యాసాలు, నాటకాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. పాఠశాల హిందీ ఉపాధ్యాయులను లయన్స్ క్లబ్ మరియు వనిత ప్లాటినం క్లబ్ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. పాఠశాల సీనియర్ హిందీ ఉపాధ్యాయిని రాగమణి - స్వామి దంపతులు పాఠశాల అభివృద్ధి కోసం రూ.5000 విలువగల రంగస్థల తెర మరియు కార్పెట్ ను బహుకరించారు. వారి దాతృత్వాన్ని అందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు M. సంపత్ కుమార్ తో పాటు ఉపాధ్యాయులు రవి కుమార్, శ్రీకాంత్, రాగమణి, మంజుల, రజని, శైలజ, జలజ, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: