శివునిపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- ఉత్సవాల్లో పాల్గొన్న 4వ వార్డు కౌన్సిలర్ బూర్ల రాజేశ్వర్
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు10 అక్టోబర్, 202602:43 PM

స్టేషన్ ఘన్‌పూర్ అక్టోబర్ 10 ప్రజాధ్వని: శివునిపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో బొడ్రాయి వద్ద బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ వేడుకలకు 4వ వార్డు కౌన్సిలర్ బూర్ల రాజేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని అన్నారు. తరతరాలుగా వస్తున్న పండుగల విశిష్టతను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో 4వ వార్డుకు చెందిన మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.

