SIR పేరిట కాంగ్రెస్ అల్లర్లు సృష్టిస్తోంది: సౌడ రమేష్
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు1 నవంబర్, 202602:10 AM
దేశంలో కాంగ్రెస్ పార్టీ SIR పేరిట అల్లర్లు, అలజడలు సృష్టించే ప్రయత్నం చేస్తుందని భాజపా పార్టీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ అన్నారు.డివిజన్ కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో శనివారం జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలోని అంజిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన 'మేధావులతో…

స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 31 (ప్రజాధ్వని): దేశంలో కాంగ్రెస్ పార్టీ SIR పేరిట అల్లర్లు, అలజడలు సృష్టించే ప్రయత్నం చేస్తుందని భాజపా పార్టీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ అన్నారు.డివిజన్ కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో శనివారం జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలోని అంజిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన 'మేధావులతో సంగోష్టి' కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.SIR ప్రక్రియ గురించి తెలియని వ్యక్తులు మాట్లాడుతూ రాద్ధాంతాలు, దౌర్జన్యాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. అనేక దేశాల నుంచి వచ్చిన వ్యక్తులు భారత్ లో చొరబడి దొంగ ఓట్లను ఏర్పాటు చేసుకొని అల్లర్లు చేయడానికి చూస్తుంటే, ఈ SIR ప్రక్రియ మొదలు పెట్టడం జరిగిందని తెలిపారు.దేశంలోని దొంగ ఓట్లను తొలగించడమే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అవే దొంగ ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని చూస్తుందని మండిపడ్డారు.ప్రస్తుతం ప్రపంచ దేశాలు నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారత్ నాలుగో స్థానంలో ఉండడం నరేంద్ర మోదీ చేసిన మార్క్ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చౌడ రమేష్, ప్రముఖ వ్యాపారవేత్త బల్ల శ్రీనివాస్, రెడ్ క్రాస్ సభ్యులు డాక్టర్ అంబటి హేమంత్ రాజ్, జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు గడ్డం రాజు, సామాజికవేత్త యంజాల ప్రభాకర్, రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, అడ్వకేట్ చిలుక విజయరామారావు, వ్యాపారవేత్త పాలకుర్తి సోమశేఖర్, జొన్నల రాజేశ్వర్,స్టేషన్ ఘనపూర్ చిల్పూర్, మండలాల అధ్యక్షులు వెంకటరమణ గౌడ్, గంటే ఉపేందర్ యాదవ్ లు తదితరులు పాల్గొన్నారు.
