విద్యానగర్ లో భక్తిశ్రద్ధలతో గణపతి పూజలు
- గణనాథుడి చెంతనే భక్తి పారవశ్యం
- అంగరంగ వైభవంగా వినాయక ఉత్సవాలు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు24 సెప్టెంబర్, 202602:28 AM

స్టేషన్ ఘనపూర్ సెప్టెంబర్ 24 ప్రజాధ్వని :పట్టణ కేంద్రంలోనీ విద్యానగర్ కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గణనాథుడి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కాలనీలో కొలువుదీరిన గణపయ్యకు ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీరొక్క నైవేద్యాలతో ప్రసాదాలు సమర్పించి, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఘనంగా పూజలు జరిపించారు. ఏకదంతుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మహిళలు కుంకుమార్చన పూజలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

