ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    రాజవరం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు18 ఏప్రిల్, 202607:02 AM

    కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

    రాజవరం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
    చిల్పూర్ మండలం రాజవరం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు ఈ కేంద్రాన్ని సమర్థంగా నిర్వహించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
    రాజవరం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం - అదనపు చిత్రం 1
    సమావేశంలో మాట్లాడుతున్నా ఎమ్మెల్యే కడియం శ్రీహరి
    ఈ కేంద్రానికి సుమారు 50 వేల క్వింటాళ్ల వరకూ ధాన్యం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రైతుల కోసం నీడ, తాగునీరు, రాత్రి భద్రత, విద్యుత్ సౌకర్యాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. మహిళా సంఘాలకు కేంద్రాల నిర్వహణ ఇవ్వడం ద్వారా వారికి ఉపాధి, ఆర్థిక లాభం కలుగుతుందని చెప్పారు. కమిషన్ రూపంలో మంచి ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో విస్తృతంగా వరి, మక్క సాగు జరుగుతోందని, రైతులకు మద్దతు ధర అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం, మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పంట రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, యాంత్రీకరణ సబ్సిడీ వంటి పథకాలు అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ఆర్డివో వెంక్కన్న, అగ్రికల్చర్ ఆఫీసర్ నజీరుద్దీన్,గ్రామ సర్పంచ్ రాజు,అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు
    మీ స్పందన:

    షేర్ చేయండి: