ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    ప్రాంతీయ వార్తలు

    శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన బిజెపి నాయకులు

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు23 జూన్, 202611:37 AM
    శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన బిజెపి నాయకులు
    చిల్పూర్, జూన్ 23 ప్రజాధ్వని : "ఒకే దేశం - ఒకే రాజ్యాంగం" అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకుని బీజేపీ చిల్పూర్ మండల కమిటీ అధ్యక్షులు గంటె ఉపేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు ఉండకూడదని శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేసిన పోరాటం దేశ సమైక్యతకు దోహదపడిందన్నారు. ఆర్టికల్-370 రద్దుకు ఆయన ఆలోచనా విధానమే ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కన్వీనర్ కాదుగాయ రమేష్, దోమల రవీందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వెలిశాల శ్రీనివాస్, జోగులు మండల నాయకులు కన్నెబోయిన అశోక్ యాదవ్, కట్ల అనిల్ కుమార్, శైలేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: