కళ్యాణలక్ష్మికి 12 ఏళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు2 అక్టోబర్, 202610:03 AM

ధర్మసాగర్, అక్టోబర్ 2 (ప్రజాధ్వని): తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన కళ్యాణలక్ష్మి పథకం ప్రారంభించి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామంలో వేడుకలు నిర్వహించారు. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. ఆడబిడ్డ పెళ్లి పేద కుటుంబానికి ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. తెలంగాణ ఆడపడుచులకు ఈ పథకం అండగా నిలిచిందని, 12 ఏళ్లుగా లక్షలాది కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్దపెండ్యాల గ్రామ శాఖ అధ్యక్షులు వల్లాల రాజు, కరుణాపూర్ సర్పంచ్ రీనా ప్రవీణ్, సోషల్ మీడియా ఇన్‌చార్జి గుర్రపు ప్రవీణ్, మండల నాయకులు కర్ర సోమిరెడ్డి, బుల్లెట్ల లావణ్య, రాజారపు సుమన్, పుండ్రు వీరారెడ్డి, పెసరు రాజయ్య, ఆకారపు ప్రశాంత్, గడ్డం రాజు, లోకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
