చిల్పూర్లో కడియం మార్క్.. ఐటీఐ కళాశాలకు స్థల చదును
- వెంకటేశ్వరపల్లిలో ఐటీఐ కళాశాల ఏర్పాటుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కృషి
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు15 అక్టోబర్, 202605:22 AM
చిల్పూర్, అక్టోబరు 15 (ప్రజాధ్వని):చిల్పూర్ మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామంలో ఐటీఐ కళాశాల ఏర్పాటుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన కృషి ఫలించింది. కళాశాల మంజూరు కావడంతో నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని చదును చేసే పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు…

చిల్పూర్, అక్టోబరు 15 (ప్రజాధ్వని):చిల్పూర్ మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామంలో ఐటీఐ కళాశాల ఏర్పాటుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన కృషి ఫలించింది. కళాశాల మంజూరు కావడంతో నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని చదును చేసే పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు శ్రీకారం చుట్టారు. ఐటీఐ కళాశాల ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి చిల్పూర్ మండల ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, చిల్పూర్ గుట్ట దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు ఆదేశాల మేరకు వెంకటేశ్వరపల్లి సర్పంచ్ శివరాత్రి రేణుక వీరస్వామి ఆధ్వర్యంలో కళాశాలకు కేటాయించిన స్థలాన్ని చదును చేసే పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చిర్ర నాగరాజు, జిల్లా కార్యదర్శి గడ్డమీది సురేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో ఐటీఐ కళాశాల ఏర్పాటు దోహదపడుతుందని నాయకులు పేర్కొన్నారు.
