చెరువు కట్టపై ముళ్ల పొదల తొలగించిన కౌన్సిలర్
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు11 జూన్, 202605:55 AM

స్టేషన్ ఘనపూర్, జూన్ 11 ప్రజాధ్వని : శివునిపల్లిలోని నాలుగవ వార్డులో చాలా కాలంగా చెరువు కట్టపై పెరిగిన ముళ్ల పొదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నాలుగో వార్డు ప్రజలకు ఊరట లభించింది. వార్డు కౌన్సిలర్ బూర్ల రాజేశ్వర్ చొరవతో గురువారం మున్సిపల్ సిబ్బంది, జేసీబీ సహాయంతో చెరువు కట్టపై ముళ్ల పొదల తొలగింపు పనులు ప్రారంభించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు స్పందించిన కౌన్సిలర్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బూర్ల విష్ణు, మత్స్యకార సంఘం అధ్యక్షుడు చిక్కుడు రమేష్, ఉపాధ్యక్షుడు చెన్నూరు వేణు, 5వ వార్డు కౌన్సిలర్ చల్ల రమ్య-రఘురెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సంకెళ్ల రవి, పెద్ది రాజబాబు, పింగిలి రాహుల్, వెయ్యి శ్రీను, రైతులు తదితరులు పాల్గొన్నారు.
