ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    స్టేషన్ ఘనపూర్‌లో ఘనంగా గుడ్ ఫ్రైడే సిలువ యాత్ర

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు4 ఏప్రిల్, 202604:09 AM
    స్టేషన్ ఘనపూర్‌లో ఘనంగా గుడ్ ఫ్రైడే సిలువ యాత్ర
    స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని నిర్మల మాత దేవాలయం (క్యాథలిక్ చర్చ్) ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా సిలువ యాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శుక్రవారం ఉదయం 6:30 గంటలకు ప్రారంభమైన ఈ యాత్రలో కతోలిక విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్సీ కాలనీ నుంచి ప్రారంభమైన సిలువ యాత్ర బస్టాండ్, అక్కడి నుంచి ఆసుపత్రి, గాంధీ విగ్రహం, ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు కొనసాగి నాలుగు ప్రధాన స్థలాలను చేరుకుని తిరిగి చర్చికి చేరుకుంది. యాత్రంతా విశ్వాసులు ప్రార్థనలు చేస్తూ, ఆధ్యాత్మిక గీతాలు ఆలపిస్తూ, జపమాలలు జపిస్తూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య పాల్గొని స్వయంగా సిలువను మోసి విశ్వాసులకు ఆదర్శంగా నిలిచారు. అలాగే మున్సిపాలిటీ కౌన్సిలర్ తాటికొండ మధు కూడా ఆయనతో పాటు సిలువ మోసి యాత్రలో పాల్గొన్నారు. చర్చి ఫాదర్ ఆగస్ట్ రెడ్డి సహా ఇతర ఫాదర్లు కార్యక్రమాన్ని నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గుడ్ ఫ్రైడే ఆధ్యాత్మికతను ప్రతిబింబించారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: