ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    గణపతి నిమజ్జనం వేళ అప్రమత్తంగా ఉండాలి

    • వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు22 సెప్టెంబర్, 202602:18 AM
    గణపతి నిమజ్జనం వేళ అప్రమత్తంగా ఉండాలి
    రాయపర్తి, సెప్టెంబరు 21 ప్రజాధ్వని: గణపతి నిమజ్జనాల సందర్భంగా ఉత్సవ కమిటీలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో అప్రమత్తంగా వ్యవహరించాలని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య సూచించారు. సోమవారం రాయపర్తి మండలంలోని నిమజ్జన ప్రాంతాలను పోలీసు, రెవెన్యూ, పంచాయతీ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో వినాయక నిమజ్జనాలు నిర్వహించే చెరువులు, కుంటల వద్ద గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. గణేష్‌ ఉత్సవ కమిటీలు శోభాయాత్రలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించి, వీలైనంత వరకు చీకటి పడకముందే నిమజ్జన కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలని తెలిపారు.

    డీజేలకు అనుమతి లేదు

    వినాయక శోభాయాత్రల్లో డీజేలు, సౌండ్‌ సిస్టమ్‌ల వినియోగానికి అనుమతులు లేవని ఏసీపీ స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి డీజేలు వినియోగిస్తే సంబంధిత వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ఊరేగింపుల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అసభ్యకరంగా నృత్యాలు చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. నిమజ్జనాల సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో పోలీసులు గస్తీ నిర్వహిస్తారని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. రాయపర్తిలోని మంచినీళ్ల చెరువును ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ సంజీవరావు, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో పాక శ్రీనివాసులు, గిర్దావర్‌ కొయ్యాడ చంద్రమోహన్‌, పంచాయతీ కార్యదర్శి యాకూబ్‌ నాయక్‌ తదితరులతో కలిసి ఎస్సై ముత్యం రాజేందర్‌ పరిశీలించారు. నిమజ్జన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: